News March 16, 2025
TODAY HEADLINES

* రాష్ట్రం కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తా: రేవంత్
* BRS కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి
* కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: KTR
* హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్
* కోటరీ వల్ల రాజూ పోయేవాడు.. రాజ్యమూ పోయేది: VSR
* గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా
* తగ్గిన బంగారం ధరలు
* హమాస్‌కు మద్దతు.. USలో భారతీయ విద్యార్థిని వీసా రద్దు
Similar News
News March 16, 2025
ఫ్రాంచైజీ క్రికెట్ రారాజు ముంబై

ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. 2011 CLT20 టైటిల్‌తో మొదలైన కప్పుల వేట నిరంతరాయంగా కొనసాగుతోంది. IPLలో 5టైటిళ్లు గెలుచుకొని చెన్నైతో పాటు టాప్ ప్లేస్‌లో ఉంది. నిన్నజరిగిన WPL ఫైనల్‌లోనూ విజయం సాధించింది. మెుత్తంగా అన్ని క్రికెట్ లీగ్‌లలో కలిపి 12 టైటిళ్లు గెలిచింది. ఈ విజయాలతో ఫ్రాంచైజీ క్రికెట్‌లో నంబర్‌వన్ జట్టుగా సత్తా చాటుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.
News March 16, 2025
రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.
News March 16, 2025
ట్విటర్లో గ్రోక్ హల్‌చల్.. మీమ్స్ వైరల్

ట్విటర్ తీసుకొచ్చిన గ్రోక్ AI గురించి నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. నిజమైన మనిషి తెలుగును ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే ఎలా ఉంటుందో అదే తరహాలో భాషలో ఎటువంటి తప్పులూ లేకుండా గ్రోక్ జవాబులిస్తోంది. ఆఖరికి బూతులు కూడా నేర్చుకుని, తిట్టిన వారిని తిరిగి తిడుతుండటంతో ట్విటర్ జనాలు జోకులు పేలుస్తున్నారు. ఫ్యాన్ వార్స్‌లోనూ గ్రోక్‌ను ఇన్వాల్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా భాషల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.