News March 16, 2025
ADB: ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే రాములోరి తలంబ్రాలు

భద్రాచలంలో ఏప్రిల్ 6న నిర్వహించనున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి వెళ్ళని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్ తెలిపారు. ఒక ప్యాకెట్‌కి రూ.151 చెల్లించి ఆఫ్‌లైన్‌లో గానీ, ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ తలంబ్రాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కార్గో కౌంటర్లు ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
Similar News
News April 23, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రణయ్

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదాలి ప్రణయ్ సత్తా చాటాడు. ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000కి 991 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి సదాలి బాపన్న-గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో యువకుడిని గ్రామస్థులు అభినందించారు.
News April 23, 2025
విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ అరెస్ట్: SP

పాఠశాల విద్యార్థినులు, మహిళా టీచర్‌ను వేధించిన పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల జడ్పీహెచ్ఎస్‌లో పీఈటీ గుండి మహేశ్ విద్యార్థినులు, మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకొని, షీ టీంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం పీఈటీని అరెస్ట్ చేశారు.
News April 23, 2025
ఆదిలాబాద్: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.