News March 16, 2025
పెరిగిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శనివారం 1,060 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.53,000, ప్రసాద విక్రయాలు రూ.11,25,420, VIP దర్శనాలు రూ.3,60,000, బ్రేక్ దర్శనాలు రూ.1,17,600, కార్ పార్కింగ్ రూ.4,25,500, వ్రతాలు రూ.1,53,500 సువర్ణ పుష్పార్చన రూ.79,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.40,79,877 ఆదాయం వచ్చింది.
Similar News
News March 14, 2026
గోదావరిఖని: హోటల్స్ తనిఖీ.. 19 సిలిండర్స్ సీజ్

పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరిఖని ప్రాంతంలోని 7 హోటల్స్ తనిఖీ చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ దాసరి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. గృహ వినియోగానికి వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నందున 19 సిలిండర్స్ సీజ్ చేసి, 7 హోటల్స్ పై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
News March 14, 2026
మంథని: గ్యాస్ కొరతపై మంత్రి శ్రీధర్ బాబు స్పందన

మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని తెలిపారు. గ్యాస్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. సామాన్యులకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 14, 2026
సిరిసిల్ల: ‘రాష్ట్రంలో ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి’

రాష్ట్రంలో ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లు, నీటి పారుదల ప్రాజెక్టులలో నీటి నిలువ, యాసంగి పంటల కొనుగోలకు ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు.


