News March 16, 2025

ADB: ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమావేశం

image

ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణపై శనివారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 6,7,8తో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.

Similar News

News April 23, 2025

నలుగురిపై కేసు.. ముగ్గురి అరెస్ట్: ADB SP

image

రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సయ్యద్ యాసిన్, జనాబ్, ముబారక్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండవ కేసులో హబీబ్, సర్దార్ (పరారీ) కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 23, 2025

ADB: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

image

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.

News April 23, 2025

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు

image

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్‌కు చెందిన గాజంగుల రాజు 3వ సారి ఎన్నికయ్యారు. HYDలో మంగళవారం జరిగిన సంఘం మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గాజంగుల రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కీర్తి రమణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దీంతో సంఘం నాయకులు వారి అభినందించారు.

error: Content is protected !!