News March 16, 2025

తాడూర్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన ప్రారంభం

image

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీఈఓ రమేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతులను ప్రారంభించారు. ఈ తరగతులు విద్యార్థుల అభ్యాసాలను మెరుగుపర్చడంతో పాటు, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని 13 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు.

Similar News

News March 7, 2026

రేపు వరుణ్ ఆడతాడా? సూర్య రెస్పాన్స్ ఇదే..

image

T20 WC: టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. దీంతో ఫైనల్లో అతణ్ని తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. దీనిపై కెప్టెన్ సూర్య స్పందించారు. ‘వరుణ్ ఫామ్‌పై మాకు ఆందోళన లేదు. ఇది టీమ్ స్పోర్ట్. అతని ఒక్కడి పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించడం లేదు. అతడు వరల్డ్ నం.1 బౌలర్. టీమ్‌ను ఎలా గెలిపించాలో అతనికి తెలుసు’ అంటూ వరుణ్‌ను వెనకేసుకొచ్చారు. జట్టులో మార్పులు రేపే తెలుస్తాయన్నారు.

News March 7, 2026

విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

image

బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కౌశిక్ రెడ్డి, అచ్యుత్ సాయి, రేవంత్, సాయి వివేక్ తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్లు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏసీపీ దామోదర్ వెల్లడించారు. వీరి నుంచి 19.70 గ్రాముల MDMA డ్రగ్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

News March 7, 2026

విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

image

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.