News March 16, 2025
NRML: LRS దరఖాస్తుదారులకు కలెక్టర్ సూచనలు

LRS దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. LRSకు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిల్లో 17,906, గ్రామీణ ప్రాంతాల్లో 6,680 దరఖాస్తులను రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు అర్హమైనవిగా గుర్తించినట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News April 16, 2026
సిద్దిపేట: నిరుద్యోగుల ప్రత్యేక కోచింగ్

సిద్దిపేట ఐటీ టవర్‌లో ఉన్న టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతి, యువకులకు టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులపై శిక్షణ ఇస్తునట్టు టాస్క్ మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 16,17,18 తేదీలలో ఐటీ టవర్ టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. బీటెక్, డిగ్రీ పాస్ అయిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు టాస్క్ కేంద్రంలో సంప్రదించాలన్నారు.
News April 16, 2026
కర్నూలు: అనారోగ్యం బారిన పడినా.. ఇంటర్‌లో అద్భు ప్రతిభ

కర్నూలు(D) పెద్దకడుబూరుకు చెందిన బొగ్గుల హరిత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వ్యవసాయ కూలీలు బొగ్గుల పరమేశ్, జ్యోతి దంపతుల కుమార్తె హరిత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడినా ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరై 1000 మార్కులకు 956 మార్కులు సాధించింది. ఆమె విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హరిత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>


