News March 16, 2025

PDPL: డ్రగ్స్ నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: అదనపు కలెక్టర్

image

పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణు కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టే చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతిశాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేయాలని ఆయన సూచించారు.

Similar News

News January 21, 2026

నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్

image

అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్-ఉష దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాన్స్ ప్రకటించారు. ‘ఉష మా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతోంది. మా బాబు జులైలో పుట్టబోతున్నాడు. ఈ సంతోష సమయంలో మా ఫ్యామిలీ, దేశం కోసం కష్టపడుతున్న సిబ్బందికి, సేవలందిస్తున్న మిలిటరీ డాక్టర్లకు ధన్యవాదాలు’ అని తెలిపారు. లా స్కూల్లో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ 2014లో పెళ్లిచేసుకున్నారు.

News January 21, 2026

ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

image

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.

News January 21, 2026

రికార్డు సృష్టించిన కడప

image

ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీలో కడప జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. కార్గో మాసోత్సవాల్లో భాగంగా 10,961 టార్గెట్ కాగా ఏకంగా 17,937 డెలివరీలు పూర్తి చేశారు. మంగళవారం 4వ విడత లక్కీ డిప్ విజేతలకు ‘కోతాస్ ప్రొడక్ట్స్’ ఛైర్మన్ అభిరామ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని డీపీటీవో గోపాల్ రెడ్డి కోరారు. పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.