News March 16, 2025

ఎఐ ద్వారా విద్యా బోధన: ASF అదనపు కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ద్వారా విద్య బోధన చేయనున్నట్లు ఆసిఫాబాద్  అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కెరమెరి మండలం గోయగం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News March 22, 2026

పాలమూరు: జిల్లాకు ప్రాణధారలు కృష్ణ, దుందుభి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణ, దుందుభి నదులు వ్యవసాయానికి ఊపిరిపోస్తున్నాయి. జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. నేడు ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని, ఈ జీవనదులను కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

News March 22, 2026

NGKL: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’

image

నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకానున్నాయి. తొలిదశలో ఎకరా లోపు భూమి ఉన్నవారికి పెట్టుబడి సాయం అందనుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 3.41 లక్షల మంది రైతులకు గాను మొత్తం రూ.415.23 కోట్లు జమ చేయనున్నారు. జిల్లాలో సుమారు 8.30 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తించనుంది.

News March 22, 2026

ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

image

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.