News March 24, 2024

మిర్యాలగూడ విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి 

image

రాజ్యాంగ విలువలను కాపాడటానికి ఏర్పడిన పౌర సమాజ వేదిక జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుత దేశంలో ‘రాజ్యాంగ విలువల పరిస్థితి ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో MLG కేఎన్ఎం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండీ. యాస్మిన్ మొదటి బహుమతి సాధించింది. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రైజ్ అందజేశారు.

Similar News

News February 19, 2026

NLG: బాధితుడికి అండగా నిలిచిన కలెక్టర్

image

నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఉదారతను చాటుకున్నారు. కొండమల్లేపల్లి పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన, వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడైన పరశురామ్‌ను పరామర్శించారు. స్వయంగా అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి పంపే వరకు అక్కడే ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు.

News February 19, 2026

NLG: నిరుద్యోగులకు ‘న్యాక్’ (NAC) ఉచిత శిక్షణ, ఉపాధి

image

నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ అకాడమీ (NAC) ఉచిత శిక్షణతో పాటు 100% ఉపాధి కల్పించనుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎలక్ట్రీషియన్, సూర్యమిత్ర సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ కోర్సులకు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలి. 90 రోజుల శిక్షణలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. ఆసక్తి గల వారు నల్గొండ ఐటీఐలోని NAC కార్యాలయంలో లేదా 7893332674, 8297431655 నంబర్లలో సంప్రదించవచ్చు.

News February 19, 2026

నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.