News March 16, 2025

పంతంగి టోల్ ప్లాజా వద్ద గంజాయి పట్టివేత

image

భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని SOT పోలీసులు పంతంగి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. మొత్తం 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చౌటుప్పల్ పోలీసులు తెలిపారు.

Similar News

News January 19, 2026

నిజామాబాద్: ఈనెల 20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు

image

నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల గణన ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ గణనలో పులులు, చిరుతలు, జింకలు, నెమళ్లు, అడవి పందులు తదితర వన్యప్రాణుల సంఖ్యను లెక్కించనున్నారు. సిరకొండ, కమ్మర్పల్లి, ఇందల్వాయి, వర్ని, ఆర్మూర్, నిజామాబాద్ రేంజ్ పరిధిలో ఈ గణన చేపట్టనున్నారు. గణన ఫలితాల ఆధారంగా అటవీ సంరక్షణ, భద్రత చర్యలు మరింత బలోపేతం చేయనున్నారు.

News January 19, 2026

నేటి నుంచే సర్పంచులకు ‘పాఠాలు’.. మూడు విడతల్లో శిక్షణ

image

నూతనంగా ఎన్నికైన సర్పంచులకు వారి విధులు, బాధ్యతలపై నేటి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. స్థానిక డీపీఆర్సీ,టీటీడీసీ భవనాల్లో మూడు విడతల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగం వంటి కీలక అంశాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పిస్తారు. తొలివిడత నేటి నుంచి 23వరకు ఏడు మండలాల సర్పంచులకు శిక్షణ ఇవ్వనుండగా, ఫిబ్రవరిలో మిగిలిన రెండు విడతలు కొనసాగుతాయి.

News January 19, 2026

చార్‌ధామ్ యాత్ర.. టెంపుల్స్‌లోకి మొబైల్స్ బంద్

image

చార్‌ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లోకి మొబైల్స్, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్స్, కెమెరాలు సేఫ్‌గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.