News March 16, 2025

హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్

image

వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కులు స్థిరమైన జీవన విధానానికి న్యాయమైన పరివర్తన/మార్పు అనే అంశంపై వివిధ శాఖల అధికారులు వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

Similar News

News March 29, 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలు ఉన్నవారు https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వినతుల స్థితిని 1100 నెంబర్ లో తెలుసుకోవచ్చని చెప్పారు.

News March 29, 2026

IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

image

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.

News March 29, 2026

ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

image

విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.