News March 16, 2025
సబ్బవరం: మినరల్ డీలర్ లైసెన్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

సబ్బవరం మండలంలో వినియోగదారులకు ఇసుక సరఫరా చేసేందుకు మినరల్ డీలర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి కలెక్టర్, జిల్లా ఇసుక కమిటీ ఛైర్మన్ విజయ కృష్ణన్ శనివారం తెలిపారు. తూర్పు శ్రీకాకుళం జిల్లాల నుంచి సబ్బవరం ఇసుక కేంద్రానికి ఇసుకను రవాణా చేయడంతో పాటు నిల్వ కేంద్రం నుంచి వాహనాలలో లోడ్ చేయడానికి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News January 12, 2026
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో వారం రోజుల క్రితం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సోనియా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తదుపరి చికిత్సను వైద్యులు ఇంటివద్దే కొనసాగించాలని సూచించారని తెలిపాయి.
News January 12, 2026
పింగళ, గేరువా జాతి పుంజులను ఎలా గుర్తిస్తారు?

‘ఎర్రపొడ’ రకం పుంజు ఈకలు ఎక్కువ ఎరుపుగా, పొడిగా మెరుస్తూ ఉంటాయి. ‘సవల’ కోడి మెడపై నల్లని ఈకలుంటాయి. ‘కొక్కిరాయి’ ఈ రకం పుంజు శరీరం నల్లగా ఉన్నా 2,3 రకాల ఈకలుంటాయి. ‘మైల’ ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి. ‘పూల’ ఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి. ‘పింగళ’ పుంజుకు ఎక్కువగా రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. ‘గేరువా’ జాతి కోడిపుంజుకు తెలుపు, లేత ఎరుపు రంగు ఈకలు మిశ్రమంగా ఉంటాయి.
News January 12, 2026
ధైర్యంగా ఉన్నా.. కుమారుడికి మదురో సందేశం

అమెరికా జైలులో ఉన్న వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో తన కుమారుడు నికోలస్ మదురో గుయెర్రాకు భావోద్వేగ సందేశం పంపారు. తనను కలిసిన లాయర్ల ద్వారా “నేను పోరాట యోధుడిని, ధైర్యంగా ఉన్నా. నా గురించి విచారపడొద్దు” అని తెలిపారు. ఎదుటివాళ్లు ఎంత శక్తిమంతులైనా భయపడొద్దని సూచించారు. తాను క్షేమంగా ఉన్నానని, US నిర్బంధంలోనూ ధైర్యం కోల్పోలేదని చెప్పారు. ఈ విషయాలను గుయెర్రా మీడియాకు వెల్లడించారు.


