News March 16, 2025
పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేక అధికారి డా. నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ప్రత్యేక అధికారి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అభివృద్ధి సాధన లక్ష్యంగా అడుగులు వేస్తుందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సైతం అభివృద్ది దిశగా అడుగులు వేయాలని చెప్పారు.
Similar News
News November 14, 2025
పరకామణి చోరీ కేసులో విచారణ వేగవంతం

తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ బృందం విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం మాజీ వీజీవో బాలిరెడ్డి, సీఐ చంద్రశేఖర్ సహా చోరీ జరిగిన రోజు డ్యూటీలో ఉన్న ఇతర ఉద్యోగులను విచారిస్తున్నారు. ఉదయం టీటీడీ జేఈవో కూడా వచ్చి వెళ్లినట్లు సమాచారం. మాజీ AVSO <<18285119>>సతీశ్ మృతి<<>>తో కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
News November 14, 2025
ఉసిరిలో తుప్పు తెగులు – నివారణ ఎలా?

ఉసిరిలో తుప్పు తెగులు సోకిన చెట్ల ఆకులపై తొలుత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇవి తుప్పు రంగుకు మారతాయి. వాటిని మనం చేతితో ముట్టుకుంటే ఆ రంగు మన చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వదశకు చేరే కంటే ముందే రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 1ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి చెట్టుపై పిచికారీ చేయాలి.
News November 14, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన MIM మద్దతు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 16 ఏళ్లుగా గెలుపు కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నిక కలిసి వచ్చింది. కాగా ఈసారి కాంగ్రెస్‌కు అటు MIMతో పాటు TJS, CPI, CPM సహా పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మద్దతు కూడగట్టడంలో CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యహరించడంతో ఆ పార్టీలు ఉపఎన్నికలో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశాయి. దీంతో అత్యధిక మెజార్టీతో హస్తం పార్టీ విజయం సాధించింది.


