News March 16, 2025
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శనివారం హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.
Similar News
News March 10, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్తీక్ మృతి

ఎచ్చెర్ల ప్రధాన రహదారిలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనం <<19333513>>బోల్తా<<>> ఘటనలో అరసవిల్లి కార్తీక్ (18) గాయపడిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు మధు చరణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రహదారిపై మొక్కజొన్న పంట టార్పాలిన్ కప్పి ఉండడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అతడిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
News March 10, 2026
KNR: 14న బండి సంజయ్ యాత్ర

ఇచ్చిన మాట ప్రకారం కరీంనగర్ మేయర్ పీఠంతో పాటు స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఈనెల 14న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమై, 40 కి.మీల మేర సాగే ఈ పాదయాత్ర సాయంత్రానికి కొండగట్టు చేరుకుంటుంది. నూతన ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఆయన మొక్కులు తీర్చుకోనున్నారు.
News March 10, 2026
అమలాపురం: అన్నం ఉడకలేదని భర్త కొట్టాడు.. 112కి కాల్ చేసిన భార్య..!

అమలాపురం పట్టణంలోని మెట్ల కాలనీలో ఓ మహిళ నుంచి పోలీసులకు విచిత్రమైన పిలుపు అందింది. వండిన అన్నం సరిగ్గా ఉడకలేదనే కారణంతో భర్త తనను కొట్టాడంటూ ఆమె 112కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకోగా భర్త అక్కడ లేరు. దీంతో పోలీసులు ఆమెతో భర్తకు ఫోన్ చేయించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న విషయాలకే పోలీసులకు ఫోన్ చేయడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.


