News March 24, 2024

ఆస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠినతరం

image

తమ దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసల్ని ఆపేందుకు ఆస్ట్రేలియా వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. గత ఏడాది ఆస్ట్రేలియాలోకి వచ్చినవారిలో భారత్, చైనా, ఫిలిప్పీన్స్ పౌరులే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్ వీసాల దరఖాస్తుదారులకు ‘జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్’ను, చదువు పూర్తైన విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లేలా ‘నో ఫర్‌దర్ స్టే’ నిబంధనను తీసుకొచ్చింది. నిన్నటి నుంచే ఇవి అమలులోకి వచ్చాయి.

Similar News

News November 4, 2025

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్

image

AP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు. ఆ ప్రాంతంలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతుల్ని పరామర్శిస్తారు. తర్వాత అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

News November 4, 2025

ప్రతిరోజు ఈ హనుమాన్ మంత్రం పఠిస్తే..

image

‘ఓం పవన సుత హనుమాన్ కీ జై’ అనే మంత్రాన్ని నిత్యం జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా అనూహ్యమైన శక్తి సొంతమవుతుందని అంటున్నారు. ఈ శక్తిమంతమైన మంత్రాన్ని రోజూ 108 సార్లు ఉచ్చరించడం వలన మనోబలం, ధైర్యం పెరుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ జపం వలన తక్షణ ఫలితాలు రావడంతో పాటు, సమస్త భయాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హనుమంతుని కృపతో అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆశిద్దాం.

News November 4, 2025

నేటి నుంచి పరీక్షల బహిష్కరణ: ప్రైవేట్ కాలేజీలు

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం నిన్నటి నుంచి ప్రైవేట్ కాలేజీలు <<18182444>>బంద్<<>> చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి జరిగే పరీక్షలన్నీ బహిష్కరిస్తున్నట్లు యాజమాన్య సంఘం తెలిపింది. మొత్తం బకాయిల్లో రూ.5 వేల కోట్లు చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని FATHI ఛైర్మన్ రమేశ్ తెలిపారు. ఈ ఏడాది విద్యారంగానికి కేటాయించిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.