News March 16, 2025

MNCL: అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు సాయి శ్రీవల్లి

image

మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శ్రీవల్లి అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు ఎంపికైంది. జూన్ 15 నుంచి 21వరకు జపాన్‌లో జరిగే సకురా అంతర్జాతీయ సైన్స్ సదస్సులో ఆమె పాల్గొననుంది. స్త్రీల నెలవారి రుతుక్రమం ప్రక్రియలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి శ్రీజ సొంతంగా రుతుమిత్ర కిట్ పరికరం రూపొందించింది. ఈ సందర్భంగా డీఈఓ యాదయ్య, సైన్స్ అధికారి మధుబాబు ఆమెను అభినందించారు.

Similar News

News March 25, 2026

మార్చి 25: చరిత్రలో ఈరోజు

image

1655: శని గ్రహ అతిపెద్ద ఉపగ్రహం టైటాన్‌ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నారు.
1914: ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ జననం (ఫొటోలో)
1931: స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు గణేశ్ శంకర్ విద్యార్థి మరణం.
1933: భారతీయ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ జననం.
2001: నటుడు కన్నడ ప్రభాకర్ మరణం.

News March 25, 2026

JGTL: సెంటర్ ఒక దగ్గర.. పరీక్ష రాసేది మరో దగ్గర.!

image

జగిత్యాలలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అ పాఠశాల నిర్వాహకులు కొంతమంది విద్యార్థులను పక్కన ఉన్న Pvt JR కాలేజ్‌లో పరీక్షలు రాయిస్తున్నారు. అడ్రస్‌లోని స్కూల్లో కాక నిబంధనలకు విరుద్ధంగా పక్క కాలేజీలో పరీక్షలు రాయించడం పట్ల తల్లిదండ్రులు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 పరీక్షలు జరిగినా విద్యాశాఖ గుర్తించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.

News March 25, 2026

‘కంటికి తల..’ ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

image

5 రోజులు దాడులు ఆపుతామని ట్రంప్ చెప్పినా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చెయ్యేస్తే ‘కంటికి కన్ను కాదు.. కంటికి తల’ తీస్తామంటూ IRGC మాజీ కమాండర్ మొహసేన్ రెజాయీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా షిప్పులను గల్ఫ్‌లో ముంచేస్తామని హెచ్చరించారు. ఆంక్షలు ఎత్తేసి, నష్టపరిహారం చెల్లిస్తేనే ఘర్షణలు ఆగుతాయని తేల్చి చెప్పారు. USను కాపాడుకునేందుకు ఎక్కువ సమయం లేదని హెచ్చరించారు.