News March 16, 2025

IPL: ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్

image

మరో వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు బెంగళూరులోని ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో 23న SRHతో మ్యాచుకు ఆయన దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆడినా బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లేదంటే ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.

Similar News

News November 8, 2025

ప్రతి ఆటంకాన్ని తొలగించే వ్రతం ఇదే..

image

సంకటహర గణపతి వ్రతం ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతారు. ఈ వ్రతం చేస్తే ఆర్థిక, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, సంతాన లేమి, విద్యవ్యాపారాల్లో వెనకబాటు తనం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. ‘నర దృష్టి, శత్రు పీడల నుంచి ఈ వ్రతం రక్షణ కల్పిస్తుంది. వివాహం ఆలస్యం కావడం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలు కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఒకసారి చేసినా ఫలితం ఉంటుంది’ అని నమ్మకం.

News November 8, 2025

ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను ప్రారంభించిన చైనా

image

చైనా తమ మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. బుధవారం చైనాలోని సాన్యా పోర్టులో అధ్యక్షుడు జిన్ పింగ్ దీనిని ప్రారంభించినట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘జిన్‌హువా’ పేర్కొంది. కానీ, అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొంది. చైనా తీసుకొచ్చిన లియావోనింగ్(2012), షాన్‌డాంగ్(2019) కంటే ఇది పెద్దదని, దీని బరువు 80 వేల టన్నులని తెలుస్తోంది.

News November 8, 2025

పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

image

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి పైలట్‌ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.