News March 16, 2025

జనగామ: బిక్షాటన చేస్తూ విద్యార్థుల నిరసన

image

జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వినూత్న రీతిలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. సకాలంలో స్కాలర్షిప్లు రాకపోవడంతో ఫీజులు కట్టాలని కాలేజీలు ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 16, 2025

NLG: డ్రైవింగ్ కోర్సుకు దరఖాస్తు ఆహ్వానం

image

మోటార్ డ్రైవింగ్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు BC సంక్షేమ అధికారి నజీం అలీ తెలిపారు. HYD హకీం పేటలో హెవీ మోటార్, లైట్ మోటర్ డ్రైవింగ్ నేర్పుతామన్నారు. 38 రోజులపాటు ఉచిత తర్వాత అర్హత ఉన్నవారికి ఉచితంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తారని తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 16, 2025

రాజమండ్రి: అమెరికా నుంచి వచ్చానని అమ్మాయిలకు వల

image

అమ్మాయిలను మ్యాట్రిమోనీ, షాదీ డాట్‌కాం ద్వారా మోసగిస్తున్న రాజమండ్రికి చెందిన వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. నకిలీ ప్రొఫైల్‌ క్రియేట్ చేసుకుని అమెరికా నుంచి వచ్చానని, ఎన్నారైలను, రెండో పెళ్లికోసం చూస్తున్న వారి వద్ద డబ్బులు కాజేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగిన వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. వంశీపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి.

News March 16, 2025

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హత్య

image

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు ఖతల్ నిన్న రాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్‌కు ఇతడు దగ్గరి అనుచరుడు. సయీద్ ఆదేశాలతో J&Kలోని మైనారిటీలు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. ఖతల్ పర్యవేక్షణలోనే రియాసీ జిల్లాలోని భక్తుల బస్సుపై దాడి జరిగింది. ఇందులో 9 మంది మరణించారు. ఖతల్ కోసం NIA ఎప్పటినుంచో వెతుకుతోంది.

error: Content is protected !!