News March 16, 2025
తాంసి: GREAT.. మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు

తాంసి గ్రామానికి చెందిన జానకొండ అశోక్ గ్రూప్-3 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్-1లో 399 మార్కులు, గ్రూప్-2లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్-3లో 284 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 417వ ర్యాంక్ సాధించాడు. వరుసగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్న అశోక్ ప్రస్తుతం జైనథ్ మండలంలో చాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
Similar News
News November 5, 2025
ఉట్నూర్: ఈ నెల 11న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపఃల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో, 26 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డులతో కళాశాలలో హాజరు కావాలన్నారు. వివరాలకు 9885762227, 9321825562ను సంప్రదించాలాన్నారు
News November 5, 2025
పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, పారదర్శకతకు కట్టుబడి ఉండాలని సూచించారు.
News November 5, 2025
UTNR: కొత్త ఐటీడీఏ పీవో ముందున్న సవాళ్లివే

ఉట్నూర్ ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవోగా యువరాజ్ మర్మాట్ నియమితులయ్యారు. పీవీటీజీల అభివృద్ధి, గిరిజన గ్రామాల్లో వైద్యం, మౌలిక వసతుల కల్పన వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిష్కారం, రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రవేశపెట్టిన మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి.


