News March 16, 2025

సంగారెడ్డి: ఈనెల 17న ప్రజావాణి

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 17న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

image

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.

News March 5, 2026

కామారెడ్డి: స్పోర్ట్స్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

image

కామారెడ్డి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించే లక్ష్యంతో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ స్కూల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. అర్హత కలిగిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 5, 2026

BREAKING: కరీంనగర్ జిల్లాలో మహిళ హత్య

image

రామడుగు మండల కేంద్రంలో ఈరెల్ల గౌరమ్మ (55) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. గౌరమ్మ భర్త కొమురయ్య, చిన్న కుమారుడు అనిల్ వ్యవసాయం చేస్తున్నారు. పెద్ద కుమారుడు మహేశ్ ఇటీవల జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. గౌరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.