News March 16, 2025
వరంగల్ అమ్మాయితో అమెరికా అబ్బాయి మ్యారేజ్❤️

వరంగల్‌కు చెందిన అమ్మాయితో అమెరికాకు చెందిన అబ్బాయికి ఆదివారం పెళ్లి జరగనుంది. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ సంపత్- పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ ఐదేళ్ల క్రితం పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అదే కాలేజీలో చదువుతున్న గ్రాండ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో గ్రాండ్ తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. వీరి పెళ్లి వరంగల్‌లో నేడు జరగనుంది.
Similar News
News March 16, 2025
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు అమరజీవి

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అసువులు బాసిన ధన్యజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కరరావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన ప్రాణత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.
News March 16, 2025
KCRను చర్చకు రమ్మను.. హరీశ్ రావుకు రేవంత్ సవాల్

TG: తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు హరీశ్ రావుకు లేవని CM రేవంత్ విమర్శించారు. నాగార్జున సాగర్, SRSP వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు. జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే నేడు TGకి నీటిని అందిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులపై పిల్లకాకులు కాకుండా అసలైన వ్యక్తి(KCR)ని చర్చకు రమ్మనాలని హరీశ్‌కు సవాల్ చేశారు.
News March 16, 2025
మహిళా సంఘాలకు రుణాలు అందజేసిన సీఎం

మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లాకు సంబంధించిన 1289 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.100,93,33,000 విలువ గల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే కడియం ఎంపీ కావ్య తదితరులు పాల్గొన్నారు.