News March 16, 2025

NRML: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

image

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 1, 2026

వనపర్తి: నేటి నుంచి పెరిగిన పాల ధరలు

image

వనపర్తి జిల్లాలో బుధవారం నుంచి పాల ధరలను పెంచుతున్నట్లు జిల్లా పాల ఉత్పత్తి రైతుల సంఘం ప్రకటించింది. కొత్త ధరల ప్రకారం లీటరు పాలు రూ.90, కిలో పెరుగు రూ.110గా నిర్ణయించారు. మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో పాల రేట్లు పెంచక తప్పలేదని రైతులు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని కోరారు.

News April 1, 2026

కాకినాడ: ఏసీబీకి చిక్కిన శానిటరీ ఇన్‌స్పెక్టర్

image

కాకినాడ నగరపాలక సంస్థ పదో సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. తన పరిధిలోని ఓ కారు షెడ్డుకు ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసేందుకు ఆయన లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడి నుంచి రూ. 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ పి.ఎం. కిషోర్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆయనను పట్టుకుంది. రాజేంద్రప్రసాద్‌ను విచారిస్తున్నారు.

News April 1, 2026

కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

image

రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈస్ట్ యూరప్‌లోని క్రిమియాలో ఓ కొండను ఫ్లైట్ ఢీకొట్టిన ఘటనలో 29 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.