News March 16, 2025
కొడుకు సూసైడ్.. మనస్థాపంతో తల్లి ఆత్మహత్య

రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.
Similar News
News May 8, 2025
ATP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సూచించారు. AP విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. AP విపత్తుల సంస్థ SMSలు, RTGS నుంచి సూచనలను తెలుపుతున్నామన్నారు. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.
News May 8, 2025
పేదలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేయూత- కలెక్టర్

అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 68,379 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు అనంతపురం కలెక్టర్ డా. వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమాజంలోని సంపన్న వర్గాల ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, పైస్థాయి ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నత స్థాయిలో ఉన్న 10% వ్యక్తులను గుర్తించి వారి ద్వారా దిగువ ఉన్న 20% కుటుంబాలకు సహాయం అందించేలా చర్యలు చేపడతామన్నారు.
News May 7, 2025
సెక్షన్ ఫారమ్ 8పై చర్చ: అనంత కలెక్టర్

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సెక్షన్ ఫారమ్-8 కంపెనీగా నమోదు చేసే ప్రక్రియపై శనివారం చర్చ నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో JNTU వీసీ, సెంట్రల్ యూనివర్సిటీ VC, KIA ఇండియా, JSW అధికారులు పాల్గొన్నారు. సెక్షన్ ఫారమ్ 8 కంపెనీని ఏప్రిల్ 30లోపు నమోదు చేయాలన్నారు. టెండర్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సమీక్షించి, అవసరమైన దశలను పరిశీలించారు.