News March 16, 2025
సదాశివపేటలో ఉరేసుకొని వ్యక్తి మృతి

ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన సదాశివపేటలో చోటుచేసుకుంది. కర్ణాటక గుల్బర్గా జిల్లాకు చెందిన వ్యక్తి శనివారం ఉదయం బైపాస్ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Similar News
News March 25, 2026
ADB: ముగియని టెన్త్.. మొదలైన ఇంటర్ ఫైట్!

పదో తరగతి పరీక్షలు పూర్తికాకముందే ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ కళాశాలలు అడ్మిషన్ల వేట మొదలుపెట్టాయి. విద్యార్థుల సమాచారాన్ని ముందే సేకరించిన యాజమాన్యాలు, ఫలితాలు రాకముందే తల్లిదండ్రులకు ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫీజు రాయితీలు, ఉచిత హాస్టల్ వసతి అంటూ ఆశ చూపుతూ అడ్వాన్సులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అడ్మిషన్ల దందాపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News March 25, 2026
బాసర: ‘నా భర్త లేని లోకంలో నేనుండలేను’

తన భర్త లేని లోకంలో తానుండలేను అని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బాసర గోదావరి నది వద్ద చోటు చేసుకుంది. బాసర సీఐ కిరణ్ తెలిపిన వివరాలు.. ఇందల్వాయి మండలం ఆసన్‌పల్లి గ్రామానికి చెందిన పద్మ భర్త ఆనంద్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మనస్తాపంతో పద్మ బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2026
సౌత్ ఇండియా ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు

కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే దక్షిణ భారత విశ్వవిద్యాలయాల పురుషుల ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు బుధవారం బయలుదేరింది. జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మేక రమేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణారెడ్డి, కోచ్ మనోహర్ పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.


