News March 16, 2025

MNCL: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

image

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 15, 2026

ఖమ్మం: మొదటి రోజు 99.88 హాజరు శాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రకాశ్ నగర్‌లోని మౌంట్ పోర్ట్ స్కూల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో మొత్తం 16,962 మంది విద్యార్థుల్లో 16,941 మంది హాజరై 99.88 శాతం హాజరు నమోదైంది. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

News March 15, 2026

నూజివీడు: మటన్ నకిలీ అయితే!

image

నూజివీడు పట్టణంలో అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా మాంసం విక్రయాలలో నిర్ధారణ కొనసాగడం లేదని మాంసప్రియలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాంసం నాణ్యతను పరిశీలించి నిర్ధారించిన మీదట మునిసిపల్ సీలు వేసే వారని తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడం వలన ఏది నకిలీ, ఏది నాణ్యతఉన్న మాంసమో తెలియని దుర్భర స్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మాంసంపై నాణ్యత ముద్ర వేయాలని ప్రజలు కోరారు.

News March 15, 2026

కర్నూలు: నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త!

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.