News March 16, 2025
కొడుకు సూసైడ్.. మనస్థాపంతో తల్లి ఆత్మహత్య

రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.
Similar News
News November 10, 2025
జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.
News November 10, 2025
నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న ప్రభుత్వం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్‌కు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయించింది. ఆయనతో కలుపుకొని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.
News November 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 10, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


