News March 16, 2025
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి.
Similar News
News January 12, 2026
వరంగల్ భద్రకాళి సన్నిధిలో యాంకర్ సుమ

ప్రముఖ యాంకర్, సినీ నటి సుమ సోమవారం మధ్యాహ్నం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సుమకు ధర్మకర్తలు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సుమను ఆశీర్వదించి, అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు తోనుకునూరి వీరన్న, పూర్ణచందర్, మయూరి రామేశ్వర్రావు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, శ్యామ్ పాల్గొన్నారు.
News January 12, 2026
సీఎం పర్యటనపై నిర్మల్ కలెక్టర్ దిశానిర్దేశం

ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు.
News January 12, 2026
2026లో యుగాంతం.. నిజమెంత?

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.


