News March 16, 2025
నల్గొండ: DCCలకు పదవులు.. అధ్యక్ష పీఠంపై ఇంట్రస్ట్

డీసీసీ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. నల్గొండ DCCగా ఉన్న శంకర్ నాయక్కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో ఆ పదవికి పలువురు పోటీ పడుతున్నారు. సూర్యాపేట డీసీసీగా ఉన్న వెంకన్నను రైతు కమిషన్ సభ్యుడిగా నియమించింది. దీంతో ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురి దృష్టి పడింది. సూర్యాపేట స్థానాన్ని జనరల్, యాదాద్రి జిల్లాకు ఎస్సీ లేదా జనరల్ కోటాలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
Similar News
News September 18, 2025
BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: చైనా, పాక్

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని వింగ్ ‘మజీద్ బ్రిగేడ్’ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని UN సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా, PAK జాయింట్ బిడ్ సబ్మిట్ చేశాయి. AFG అభయారణ్యాల నుంచి ఈ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి. US గత నెలలో వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిందని.. కరాచీ ఎయిర్పోర్ట్, జాఫర్ ట్రైన్ హైజాక్లో వీటి ప్రమేయం ఉందని తెలిపాయి.
News September 18, 2025
కల్వకుర్తి: బైక్లు ఢీకొని ఇద్దరికి గాయాలు

కల్వకుర్తి మండలంలో గురువారం ఉదయం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుర్మిద్ద గ్రామానికి చెందిన ఇద్దరు స్కూటీపై కల్వకుర్తికి వెళ్తుండగా కాటన్ మిల్లు సమీపంలో వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ లభ్యం

తుర్కపల్లి మండలం రుస్తాపురం సమీపంలోని చోక్లా తండాలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. బస్వాపూర్ ప్రాజెక్టు పనుల కోసం మధ్యప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన కూలీల పిల్లలు గురువారం ఉదయం తప్పిపోయారు. తల్లిదండ్రులు తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే చిన్నారుల ఆచూకీ గుర్తించారు.