News March 16, 2025
HYD: అంతర్జాతీయ ప్రమాణాలతో బేగంపేట రైల్వే స్టేషన్

బేగంపేట రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. రూ.26 కోట్ల వ్యయంతో ప్రారంభమైన మొదటి ఫేజ్ పనులు తుదిదశకు చేరుకోగా.. రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల కోసం ర్యాంపులు, లిస్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్, రైల్వే సమాచారాన్ని ప్రత్యక్షంగా చూసుకునేలా డిస్‌ప్లే తదితరాలు ఏర్పాటు చేశారు. స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.
Similar News
News March 19, 2026
జిల్లాలో ఘనంగా ఉగాది.. ఊరూరా పంచాంగ శ్రవణాలు

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన జిల్లాలోని గ్రామగ్రామాన పంచాంగ శ్రవణాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోయే మంచి చెడులను పూజారులు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు హాజరయ్యారు.
News March 18, 2026
RR: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు చేయండి: కలెక్టర్

లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివసించకుంటే నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని RR కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.
News March 18, 2026
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉండాల్సిందే.. లేదంటే రద్దే

రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఈనెల 31లోపు నివాసం ఉండాలని, లేనిపక్షంలో కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను ఏప్రిల్ మొదటి వారంలో కొత్తవారికి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని RDO, MROలను కలెక్టర్ ఆదేశించారు.


