News March 16, 2025

TDP నేతలపై MLA థామస్ ఆగ్రహం

image

పేదల అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధికి అడ్డుపడితే సహించనని పలువురు TDP నేతలపై ఎమ్మెల్యే థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుమూరులో పర్యటించిన ఆయన.. కేవలం పార్టీలోని కొందరు నేతలు YCP నేతలతో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. తాను దేశాలు తిరిగిన నేతనని, అగ్రకులాల వారికి సలాం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను రెచ్చిగొడితే అంతు చూస్తానన్నారు. 

Similar News

News April 2, 2026

చిత్తూరు: హెల్మెట్ పెట్టుకుంటే బహుమతులు

image

చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ పెట్టు- బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని నిర్ణయించారు. ముఖ్య ట్రాఫిక్ కూడళ్లలో పోలీసులు అందజేసే స్లిప్పులను పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలి. వారాంత, నెలసరి బహుమతులు అందిస్తామని పేర్కొంటున్నారు. వాటితో పాట సర్టిఫికెట్లు, మెమెంటోలు అందిస్తామన్నారు.

News April 2, 2026

చిత్తూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి వాహనాల అనుమతి

image

చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్‌లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

News April 2, 2026

చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

image

మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కో టిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశాలు నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు విక్రయించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.