News March 16, 2025

VKB: 12,901 మంది విద్యార్థులకు 68 కేంద్రాలు

image

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఈవో రేణుకాదేవి తెలిపారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 12,901 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను నిర్వహించేందుకు 920 మంది అధికారులను నియమించినట్లు డీఈవో పేర్కొన్నారు.

Similar News

News January 21, 2026

JGTL: సమస్యలను పట్టించుకోండి మంత్రిగారు..!

image

ధర్మపురిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి Dy.CM భట్టి విక్రమార్కతో కలిసి వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు బుధవారం పాల్గొననున్నారు. అయితే, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, శిథిలావస్థలో ఉన్న ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులు, మధ్యలో నిలిచిపోయిన రోళ్లవాగు ప్రాజెక్టు, జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత యూనిట్లను ప్రారంభించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

News January 21, 2026

JGTL: ఉప ముఖ్యమంత్రికి సమస్యల స్వాగతం

image

TG రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ధర్మపురికి రానుండగా, జిల్లాలోని సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న రోళ్లవాగు ప్రాజెక్ట్, ధర్మపురిలో RTC డిపో ఏర్పాటు, నిర్మాణం పూర్తయినా ప్రారంభం కానీ మాతాశిశు ఆస్పత్రి, నిలిచి పోయిన అక్కపెల్లి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, ధర్మపురిలో నిలిచిన రోడ్ల విస్తరణ పనులు, ప్రధాన రహదారులు విస్తరణ కాక ఇబ్బందులు పడుతున్నారు.

News January 21, 2026

ఏలూరు: నలుగురు మహిళలపై దాడి.. ఒకరి మృతి

image

జంగారెడ్డిగూడెంలో పొలం, ఇంటి సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జీలుగులమ్మ కుటుంబంపై మేనల్లుడు గొడ్డలితో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఘటనలో మృతురాలి తల్లి చుక్కమ్మ, ఆమె కూతుళ్లు ధనలక్ష్మి, ఉషారాణి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీఎస్పీ రవిచంద్ర, సీఐ సుభాశ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.