News March 16, 2025

కరీంనగర్: రైలు పట్టాల పక్కన యువజంట మృతదేహాలు (UPDATE)

image

జమ్మికుంట(M) పాపయ్యపల్లి-బిజిగిరి షరిఫ్ గ్రామాల రైల్వే ట్రాక్ మధ్య శనివారం రాత్రి ఓ <<15773958>>యువజంట<<>> మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతిచెందిన యువకుడు ఇల్లందకుంట(M) రాచపల్లికి చెందిన మెనగు రాహుల్(18)గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దిరి తలలకు మాత్రమే గాయాలున్నాయి. ఒంటిపై ఎక్కడా గాయాలులేవు. దీంతో ఇది ఆత్మహత్య? లేక హత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News March 16, 2025

సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

image

AP: టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.

News March 16, 2025

అనంతపురం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ఈ నెల 17వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు.

News March 16, 2025

అనకాపల్లి: 10వ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సున్నితమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించమన్నారు.

error: Content is protected !!