News March 16, 2025

KMM: అనుమానంతో భార్యను, మరొకరిని నరికిన భర్త

image

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Similar News

News September 13, 2025

గాజువాక: స్పా ముసుగులో వ్యభిచారం

image

గాజువాకలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్‌ సీఐ అప్పలనాయుడు తన సిబ్బందితో దాడి చేశారు. చైతన్యనగర్‌లోని తాయ్ స్పా సెంటర్‌లో ఐదుగురు అమ్మాయిలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని గాజువాక పోలీసులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. నగరంలో అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 13, 2025

బాగా నమిలి తినండి: వైద్యులు

image

ఆహారాన్ని గబగబా తినొద్దని, అలా చేస్తే సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎంత తక్కువ సమయంలో తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేగంగా, నమలకుండా తింటే సరిపడనంత తిన్నామనే భావన కలగదని.. అరగంట పాటు నెమ్మదిగా, బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల అది పూర్తిగా జీర్ణమై పోషకాలన్నీ శరీరానికి అందుతాయని, అలాగే దవడలకూ మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.

News September 13, 2025

ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

image

పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్‌లో రేపు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.