News March 24, 2024
ADB: మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ

కాలినడకన వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన సంఘటన శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ స్ధానిక పంజాబ్ చౌక్ వద్ద బస్సు దిగి భూక్తాపూర్‌లోని బంధువుల ఇంటికి కాలినడకన వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు అకస్మాత్తుగా రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News September 7, 2025
ప్రతి ఒక్కరికీ అభినందనలు: ఆదిలాబాద్ ఎస్పీ

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భక్తి వాతావరణంలో 600 మంది పోలీసులతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు పలు సంఘాలు, కమిటీలు, మండప నిర్వాహకులు, యువత సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు.
News September 7, 2025
ఆదిలాబాద్: ‘బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం’

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. నాయకులు రవీంద్ర, జంగుబాపు, రమేశ్, జగన్మోహన్, తుకారాం తదితరులు ఉన్నారు.
News September 7, 2025
ADB: అధికార యంత్రాగానికి ప్రశంసలు, కృతజ్ఞతల వెల్లువ

ఆదిలాబాద్‌లో 2 వేలకి పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయగా.. ఆదివారంతో నిమజ్జనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. జిల్లాలో ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం 11 రోజులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూసినందుకు ప్రజలు, సామాజికవేత్తలు వారిపై ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు.