News March 16, 2025
మోపాల్: సూర్యుడిలా వెలిగిపోతున్న చంద్రుడు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి 8గంటల సమయంలో చంద్రుడిలా కాకుండా సూర్యుడిలా కాంతులు వెదజల్లుతూ చంద్రుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం కనిపించడంతో అందరిని ఈ దృశ్యం ఆకట్టుకుంది. సూర్యుడు లాగా చంద్రుడు వెలగడం అనేది మొదటిసారిగా చూస్తున్నామని మోపాల్ గ్రామస్థులు తెలిపారు.
Similar News
News March 16, 2025
బోధన్: షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన రాష్ట్ర మంత్రి

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మహారాష్ట్రలోని సాంగ్లీ తాలూకాలో చెరుకు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సాంగ్లీలోని శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ ఛైర్మన్ శ్రీగణపతి రావు పాటిల్, నాయకులు పాల్గొన్నారు.
News March 16, 2025
NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.
News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.