News March 16, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 82,580 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 18, 2025

టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే

image

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.

News March 18, 2025

నెలకు రూ.5,000.. UPDATE

image

యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పనే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి కేంద్రం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. యువతను ఇందులో భారీగా చేరేలా ప్రోత్సహించాలని MPలకు సూచించారు. ఇంటర్న్‌కు ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.5వేలు ఇవ్వనున్నారు. ఈ పథకం <<15723056>>రెండో దశ దరఖాస్తు గడువును<<>> కేంద్రం ఈ నెల 31 వరకు పొడిగించింది.

News March 18, 2025

7 సెకన్లలోనే గుండె జబ్బుల నిర్ధారణ.. NRIకి సీఎం ప్రశంసలు

image

AP: గుండె జబ్బులను నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన NRI విద్యార్థి సిద్ధార్థ్(14) CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను కలిశారు. యాప్ గురించి అడిగి తెలుసుకున్న సీఎం విద్యార్థిని ప్రశంసించారు. వైద్యరంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను సిద్ధార్థ్ ఏఐ సాయంతో రూపొందించారు. దీంతో ఇప్పటికే గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు.

error: Content is protected !!