News March 16, 2025

KNR: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు ఎప్పుడో?

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులు తమ డిగ్రీ ఫలితాలు ఎప్పుడా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ BSC, BCOM రెగ్యులర్, బాక్‌లాగ్ పరీక్షలు గత సంవత్సరం డిసెంబర్, జనవరి మధ్యలో నిర్వహించగా దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సకాలంలో ఫలితాలను విడుదల చేయాలని కోరారు.

Similar News

News October 18, 2025

మచిలీపట్నం: పిచ్చి మొక్కలు తొలగించిన కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం రైతు బజారు పక్కన ఉన్న పశువుల ఆస్పత్రిలో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.

News October 18, 2025

TPT: మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశం

image

నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హర్ నెస్సింగ్ ఇన్నోవేషన్స్ (NIDHI) పథకం ద్వారా పద్మావతి మహిళా యూనివర్సిటీ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ సహకారంతో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు చివరి తేదీ నవంబర్ 15.

News October 18, 2025

కమ్యూనిటీ బయింగ్: 186 కార్లకు ₹21 కోట్ల డిస్కౌంట్!

image

షాపింగులో బల్క్‌గా కొంటే ఏమైనా తగ్గిస్తారా అని బేరమాడటం చూస్తుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యూనిటీ సభ్యులు దీనిని వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. ఏకంగా 186 లగ్జరీ కార్లను ఒకే డీల్‌లో కొనుగోలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ కార్ల విలువ ₹149.54 కోట్లు కాగా, వారు రూ.21.22 కోట్లు డిస్కౌంట్ పొందడం విశేషం. ఒకే కమ్యూనిటీకి చెందినవారు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి లగ్జరీ కార్లను కొనడం దేశంలోనే చర్చనీయాంశమైంది.