News March 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ రేట్లు కాస్త పెరిగాయి. హైదరాబాద్ నగరంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ గత వారం రూ.160-180గా ఉండగా ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.160గా ఉంది. అటు ఏపీలోని కర్నూలులో రూ.180, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, పిఠాపురంలో రూ.220కి విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News March 16, 2025
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగింది. HYD ఫిలింనగర్‌లోని విశ్వక్ ఇంట్లో రెండు డైమండ్ రింగులు సహా రూ.2.20 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై విశ్వక్ తండ్రి సి.రాజు ఫిలింనగర్ PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున 5.50 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి వాటిని తస్కరించినట్లుగా గుర్తించారు.
News March 16, 2025
నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిలవొద్దు: సైరా బాను

సంగీత దర్శకుడు రెహమాన్ నుంచి తానింకా విడాకులు తీసుకోలేదని సైరా బాను ఓ ప్రకటనలో తెలిపారు. తనను అప్పుడే మాజీ భార్యగా పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. ‘నా అనారోగ్య సమస్యల కారణంగా మేం విడిపోయాం తప్ప ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈరోజు ఆస్పత్రిపాలైన ఆయన వేగంగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు. ఈ దంపతులకు 1995లో పెళ్లైంది. ముగ్గురు పిల్లలున్నారు. తాము విడిపోతున్నట్లు గత ఏడాది నవంబరులో బాను ప్రకటించారు.
News March 16, 2025
గుడ్ న్యూస్.. ఈ నెల 21 నుంచి వర్షాలు

TG: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.