News March 16, 2025
బాచుపల్లి: ప్రజల ఆరోగ్యంతో ఆటలా?

కొన్ని పరిశ్రమలు విష వాయువులను వదులుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని బాచుపల్లి పరిసరప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొల్లారం, కాజేపల్లి, బొంతపల్లి, జిన్నారం, పాసి మైలారం తదితర పారిశ్రామికవాడలోని కొన్ని పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా శుద్ధి చేయకుండా విషవాయువులను విడుదల చేయడంతో ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 19, 2026
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు శ్రీకారమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
News March 19, 2026
బాపట్ల జిల్లాలో 7,338 LPG సిలిండర్లున్నాయి

జిల్లాలో LPG కొరత లేదని బాపట్ల DSO జమీర్ బాషా తెలిపారు. ప్రస్తుతం 7,338 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో 27 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాతే బుకింగ్ చేయాలని చెప్పారు. అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయరాదని అన్నారు.
News March 19, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం.!

మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు వచ్చినట్లు ఆయన తెలిపారు. జీవన్ రెడ్డి 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకులని, పార్టీ ఆయనను వదులుకోదని, చర్చించిన అంశాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.


