News March 16, 2025
నేడు అమరజీవి జయంతి

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. ఈయన పోరాటంతో 1953 OCT 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
Similar News
News March 5, 2026
హార్ముజ్ జలసంధిలో 23వేల మంది ఇండియన్స్!

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో గల్ఫ్ రీజియన్‌లో 36 ఇండియన్ కార్గో షిప్స్ నిలిచిపోయాయి. వీటిలో LPG, LNG క్యారియర్స్, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్, కంటెయినర్ షిప్స్ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో 23 వేల మంది ఇండియన్ సైలర్స్ చిక్కుకుపోయినట్లు సమాచారం. ఒమన్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.
News March 5, 2026
ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు: చంద్రబాబు

AP: ఇక నుంచి ‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’ అని మాట్లాడాలని సీఎం CBN పిలుపునిచ్చారు. ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పుడు అసంబద్ధం. జనాభా లేక ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువగా ఉంది. జనాభా తగ్గడం వల్ల రాజకీయంగా కూడా ఇబ్బందులు వస్తాయి. నేను రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు. ఏ దేశంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ దేశం ధనిక దేశం అవుతుంది’ అని అసెంబ్లీలో చెప్పారు.
News March 5, 2026
గ్యాస్, ఆయిల్ కొరత లేదు: ప్రభుత్వ వర్గాలు

ఇంధన భద్రత విషయంలో ఇండియా కంఫర్టబుల్ పొజిషన్‌లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘అవసరమైనంత మేర నిల్వలున్నాయి. రోజూ స్టాక్ నింపుతున్నాం. LPG/LNG కొరత లేదు. ప్రపంచంలో ముడి చమురుకు షార్టేజ్ లేదు. క్రూడ్, గ్యాస్ కొనుగోలు కోసం ఉత్పత్తిదారులు, వ్యాపారులు, IEA, OPECతో చర్చిస్తున్నాం. గ్యాస్ సరఫరాకు ఆస్ట్రేలియా, కెనడా ముందుకొచ్చాయి. UAE, USతో ఒప్పందం చేసుకున్నాం’ అని వెల్లడించాయి.


