News March 16, 2025
NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.
Similar News
News March 11, 2026
సమాజ హితానికి పాస్టర్లు కృషి చేయాలి: విప్ ఆది శ్రీనివాస్

మతపరమైన సేవలతో పాటు సమాజంలో మంచి మార్పు తెచ్చేందుకు పాస్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అగ్రహారంలోని శ్రీ కన్వెన్షన్‌లో బుధవారం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక బోధనలతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించాలని ఆయన కోరారు.
News March 11, 2026
భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ స్టవ్స్ సేల్స్.. NO STOCK

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ ప్రెజర్ కుకర్స్, రైస్ కుకర్స్‌ను విపరీతంగా కొనేస్తున్నారు. బ్లింకిట్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు 2-3 రోజులుగా ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. ఒక్క ఫ్లిప్‌కార్ట్‌లోనే 300% సేల్స్ పెరిగాయి. దీంతో వాటిలో sold out, out of stock బోర్డులు కనిపిస్తున్నాయి. దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఎలక్ట్రిక్ స్టవ్స్ మీరూ కొంటున్నారా?
News March 11, 2026
కల్వరాల వాసికి జీవిత ఖైదు

వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన వడ్డే కురుమయ్యకు పోక్సో (POCSO) కేసులో వనపర్తి జిల్లా జడ్జి సునీత జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు దర్యాప్తు చేపట్టి, నేరం నిరూపితం కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.


