News March 16, 2025
మాజీ MLA రాజయ్య హౌస్ అరెస్ట్

సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ పర్యటన సందర్భంగా మాజీ MLA తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాజయ్య మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సామాన్య ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. దమ్ముంటే అక్రమ అరెస్టులు చేయకుండా జిల్లాలో పర్యటించాలన్నారు.
Similar News
News January 16, 2026
పద్ధతిగా ఉండమంటే కేసు పెడతారా?: సంధ్య

TG: తన వ్యాఖ్యలపై నటి అనసూయ <<18872663>>కేసు<<>> పెట్టడంపై కాంగ్రెస్ నేత బొజ్జ సంధ్య స్పందించారు. ‘పద్ధతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? కేసులు ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది. SMలో తల్లిదండ్రులు నా దృష్టికి తెచ్చిన విషయాన్నే ప్రస్తావించా. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగడమే. దుస్తుల్లో స్వేచ్ఛలేదు’ అని ఆమె స్పష్టం చేశారు. కాగా అనసూయ ఫిర్యాదుతో వివిధ ఛానళ్ల యాంకర్లు సహా 73 మందిపై కేసు నమోదైంది.
News January 16, 2026
పెద్దపల్లి: కాకా మెమోరియల్ T20 లీగ్ ప్రారంభం

కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, TGIIC చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కోనాపూర్‌లో ఆదిలాబాద్–ఖమ్మం జట్ల మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతలో క్రీడల ద్వారా క్రమశిక్షణ, స్పూర్తి పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలకమని పేర్కొన్నారు.
News January 16, 2026
ఇంటి సింహద్వారం ఎలా ఉండాలంటే?

ఇంటికి సింహద్వారం ఎంతో ప్రధానమైనదని, ఇది ఇంటి యజమాని అభిరుచికి, ఉన్నతికి నిదర్శనమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘సింహద్వారం ఏ దిశలో ఉన్నా దానికి రెండు వైపులా కిటికీలు ఉండటం శాస్త్రరీత్యా తప్పనిసరి. మిగిలిన ద్వారాల కంటే ఇది ఎత్తులోనూ, వెడల్పులోనూ పెద్దదిగా ఉండాలి. ప్రత్యేకమైన ఆకర్షణతో ఉట్టిపడాలి. అప్పుడే ఆ ఇంటికి నిండుదనం, వాస్తు బలం చేకూరుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


