News March 24, 2024
యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు

యూపీ మదర్సా చట్టం(2004) రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మదర్సా బోర్డు అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాల అనంతరం కోర్టు తాజా తీర్పుచెప్పింది. ‘ఈ చట్టం లౌకికవాదానికి విరుద్ధం. మదర్సాల్లో చదివే పిల్లల్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అందుకు తగిన చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలి’ అని ఆదేశించింది.
Similar News
News July 7, 2025
GET READY: 7.03PMకి ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ప్రోమో

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా విడుదల తేదీ ప్రకటనపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీతో కూడిన ప్రోమో వీడియోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 7.03కి విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News July 7, 2025
మొబైల్ రీఛార్జ్‌లు పెంపు?

రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది భారీగా ధరలు పెంచగా, ఈ సారీ 10-12% పెంచే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూజర్లు పెరగడం, 5G ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని సమాచారం. అయితే బేస్ ప్లాన్ల జోలికి వెళ్లకుండా, మిడిల్, టాప్ ప్లాన్ల రేట్లు పెంచుతారని, కొన్ని ప్లాన్లలో కోత విధిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
News July 7, 2025
జులై 7ను జీవితంలో మరిచిపోలేను: రేవంత్ రెడ్డి

తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజా పాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జులై 7ను జీవితంలో మరచిపోలేను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.