News March 16, 2025

పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

image

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News March 16, 2025

టీ పాలెం: పురుగుమందు కలిపిన నీళ్లు తాగి వ్యక్తి మృతి

image

పురుగుమందు కలిసిన మంచినీళ్లు తాగి రైతు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం సోలిపురం పిక్యాతండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బీ.రామోజీ అనే వ్యక్తి కాకరవాయిలో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తన పొలం పక్క రైతు రవి పాత కక్షల నేపథ్యంలో తన వెంట తెచ్చుకున్న నీళ్లలో పురుగుమందు కలిపాడు. ఆ నీటిని తాగి రామోజీ అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 16, 2025

రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

image

ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.

News March 16, 2025

ఖమ్మం: అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య

image

ఓ వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్, జరీనా(28) దంపతులు. జరీనా అప్పటి వరకు ఇంట్లో పని చేసుకుంటుండగా, విశ్రాంతి తీసుకోడానికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్లు చూడగా, ఉరి వేసుకొని ఉంది. ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!