News March 16, 2025
పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News October 30, 2025
సోమశిలకు పెరుగుతున్న వరద

సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 4 నుంచి 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 77,650 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 78,460 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 72 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. వరద పెరుగుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.
News October 30, 2025
టీమ్ ఇండియాకు బిగ్ షాక్

WWC: ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న స్మృతి మంధాన(24) ఔటయ్యారు. తొలుత బంతిని అంపైర్ వైడ్గా ప్రకటించగా, ఆసీస్ క్యాచ్ కోసం రివ్యూ తీసుకుంది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్మృతి అసంతృప్తిగా పెవిలియన్కు వెళ్లారు. అంతకుముందు షెఫాలీ 10 పరుగులకే వెనుదిరిగారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 60/2గా ఉంది.
News October 30, 2025
GWL: ‘నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి’

గద్వాలలో రూ.33.02 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో నర్సింగ్ కాలేజీ, విద్యార్థి వసతి గృహ ఏర్పాట్ల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.130 కోట్లతో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు.


