News March 16, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 40.8℃ నమోదు కాగా రామగిరి 40.6, పాలకుర్తి 40.5, అంతర్గం 40.4, కమాన్పూర్ 40.3, సుల్తానాబాద్ 40.2, ఓదెల 40.1, ముత్తారం 39.7, కాల్వ శ్రీరాం 39.5, రామగుండం 39.4, పెద్దపల్లి 39.3, ధర్మారం 38.4, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.3℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.
Similar News
News January 12, 2026
బాపట్ల: పోలీసులమంటూ దోపిడీ.. రూ.లక్షల్లో వసూలు

వెదుళ్లపల్లి పరిధిలో తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి, పోలీసుల వేషంలో బాధితురాలి నుంచి రూ.6.50 లక్షలు దోచుకున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. SP ఆదేశాలతో పోలీసులు సోమవారం వివరాలను వెల్లడించారు. కేసులో ఏడుగురు నిందితులను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన సిబ్బందిని SP అభినందించారు.
News January 12, 2026
రైతులకు బోనస్ డబ్బులు విడుదల

TG: సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.1,429 కోట్ల బోనస్ డబ్బులు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 12, 2026
సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

PM మోదీ కొత్త ఆఫీసు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న అందులోకి ఆయన షిఫ్ట్ కానున్నారు. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ‘సేవా తీర్థ్’ కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో PM ఆఫీస్, క్యాబినెట్ సెక్రటేరియట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ భవనాలు నిర్మించారు. 1947 నుంచి సౌత్ బ్లాక్‌లో PMO కొనసాగుతోంది. తరలింపు తర్వాత సౌత్, నార్త్ బ్లాకులను మ్యూజియాలుగా మారుస్తారు.


