News March 16, 2025

అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.

Similar News

News March 16, 2025

విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగికదాడి.. వీడియోలు వైరల్

image

విద్యార్థినుల పాలిట గురువే కీచకుడిగా మారాడు. యూపీ హథ్రాస్‌లోని పీజీ కాలేజీ ప్రొఫెసర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన 59 వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రొఫెసర్ గతంలోనూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.

News March 16, 2025

అచ్చంపేట: ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

image

అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం దేవాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందికి వస్తున్న ఆటో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. అమ్రాబాద్ మండలం తెలుగుపల్లికి చెందిన తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయని అచ్చంపేట పోలీసులు తెలిపారు. ఓ పెళ్లి వేడుక నిమిత్తం కొండపైకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందని అన్నారు. గాయాలైన వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

News March 16, 2025

నెల్లూరు: రైతును చెరువులో తోసి నగదుతో పరార్

image

తక్కువ ధరకు డీజిల్ ఇస్తానని నమ్మించి ఓ అపరిచితుడు రైతును బూరిడీ కొట్టించిన ఘటన ఆదివారం మనుబోలులో చోటు చేసుకుంది. మనుబోలుకు చెందిన ఓ రైతుకు బైకుపై వచ్చిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. రైతుకు తక్కువ ధరకు 300 లీటర్లు డీజిల్ ఇస్తామని నమ్మించి 25 వేల రూపాయలను రైతు నుంచి తీసుకున్నాడు. అ తర్వాత ఆ రైతును చెరువులో తోసి పరారయ్యాడు.

error: Content is protected !!