News March 16, 2025
వరంగల్‌లో కిలాడి లేడీ అరాచకాలు

వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేసి వారిని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత వారిపై అత్యాచారాలు చేయించి, స్పృహలో రాగానే ఎక్కడ కిడ్నాప్ చేశారో.. అక్కడ వదిలి వెళ్తున్నారు. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ విషయం బయటపడింది. ఆ కిలాడీకి మరో నలుగురు యువకులు సహాయపడుతున్నట్లు తెలుస్తోంది. వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 15, 2026
ప.గో: కన్నతల్లిని చంపిన కొడుకుకి యావజ్జీవ శిక్ష

కన్నతల్లిని అతికిరాతకంగా హతమార్చిన కుమారుడికి భీమవరం మూడో అదనపు కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పాలకోడేరుకు చెందిన నమ్మి రవి గత ఏడాది మే నెలలో తన తల్లి రాజ్యలక్ష్మిపై పదునైన కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. పోలీసులు సేకరించిన పక్కా ఆధారాలతో నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
News March 15, 2026
ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.
News March 15, 2026
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.


