News March 16, 2025
ADB: మద్యం మత్తులో ఒకరు.. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్

ADB, NRML జిల్లాల్లో ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంద్రవెల్లి మండలం బుర్సాన్‌పటర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్(57) మద్యం మత్తులో చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. బజార్హత్నూర్ మండలం రాంగనగర్‌కు చెందిన గంగారం(54) మద్యానికి బానిసయ్యారు. శనివారం తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కడెం మండలం మొర్రిగూడెంనకు చెందిన సత్తెన్న ఒంటరిజీవితం భరించలేక ఉరేసుకున్నాడు.
Similar News
News February 26, 2026
ఇక రోజూ ‘డయల్ యువర్ టీచర్’: అనకాపల్లి డీఈవో

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం 17 రోజులే ఉందని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే డయల్ యువర్ టీచర్ ప్రోగ్రాం రోజూ నిర్వహించడానికి సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.
News February 26, 2026
TU: ప్రారంభమైన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో పటిష్ఠమైన భద్రత, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News February 26, 2026
నల్గొండ: ఈ నాన్నకు సలాం చేయాల్సిందే..!

ఆడబిడ్డ.. అందులోనూ దివ్యాంగురాలు.. ఆమెకు చదువెందుకులే అని ఆ తండ్రి అనుకోలేదు. దివ్యాంగురాలైతేనేం.. తన బిడ్డ సరస్వతి మాతకు ప్రతిరూపమని భావించాడు. మర్రిగూడ(M) శివన్నగూడెంకు చెందిన మోర సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కూతురు మోర శివానికి ఫ్లోరోసిస్ కారణంగా చిన్నప్పటి నుంచి కాళ్లు పనిచేయవు. ఇవాళ మోడల్ స్కూల్‌లో ఇంటర్ సెకండియర్ పరీక్ష రాసేందుకు తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.


