News March 16, 2025

NZB: యాక్సిడెంట్.. బోల్తా పడ్డ కారు

image

నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీజీ కాలేజీ సమీపంలో బైపాస్‌పై ఓ బాలుడు సైకిల్ మీద వచ్చాడు. సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సైకిల్ పై ఉన్న బాలుడితో సహ కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 12, 2026

NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.

News January 12, 2026

NZB: 2025లో రోడ్డు ప్రమాదాల్లో 280 మృతి

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2024లో 856 ప్రమాదాలు జరిగి 351 మంది మరణించగా, 2025 నవంబరు నాటికి 815 దుర్ఘటనల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.

News January 12, 2026

NZB: ‘ప్రజావాణికి అధికారులందరూ విధిగా హాజరు కావాలి’

image

‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఆమె అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై మొత్తం 84 ఫిర్యాదులను అందజేశారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.